tollywood producers to interest remake malayalam movies

నైన్టీఎస్ దశకంలో తమిళ్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ రైట్స్ కోసం బడా నిర్మాతలు ఫాన్సీ ఆఫర్స్ ఇచ్చి మరీ కొనేవారు. ఇటీవల కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. మన తెలుగు సినిమాలు వేరే భాషల్లోకి అనువాదం అవుతూవున్నాయి. మన కథలను, సినిమాలకు బాలీవుడ్ వారు మంచి ఆఫర్స్ ఇచ్చి కొంటున్నారు. కానీ ఈ మధ్య మళ్ళీ వేరే భాషల్లోని సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్ అవుతున్నాయి. ఇక్కడ సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇంతవరకు తమిళం నుండి తెలుగులోకి డబ్ అయిన సినిమాలు చూసాం. కానీ ఈ మధ్య మళయాళం నుండి తెలుగులోకి రీమేక్ చేయడానికి తెలుగు బడా దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు.

ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలను లైన్ లో పెట్టారు కొందరు బడా నిర్మాతలు. తెలుగులో ప్రస్తుతం టాప్ నిర్మాణ సంస్థలుగా కొనసాగుతున్న రెండు సంస్థలు మళయాళం మేకింగ్ చూసి ఆహా అనుకోని హక్కులను కూడా కొనిపెట్టేసుకున్నారు. మనవాళ్ళ కన్ను మళయాళం సినిమాల మీద పడిందంటే అక్కడి వాళ్ళ నిర్మాణ విలువలు మేకింగ్ ఎంత బాగుందో అర్ధమవుతుంది. రెండు పెద్ద బ్యానర్లు ఇప్పటికే హక్కులు సొంతం చేసుకొని నటీనటుల ఎంపిక కూడా మొదలు పెట్టాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మళయాళం రీమేక్, డబ్బింగ్ సినిమాల హవా జోరందుకుంటుంది. మళయాళ భాషలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తక్కువ బడ్జెట్ లో చిన్న చిన్న సినిమాలు రూపొందించి భారీ ఇండస్ట్రీ హిట్లను అందుకుంటున్నారు. చిన్న సినిమాలు తీసి పెద్ద విజయాలను అందుకోవడంలో మాలీవుడ్ ముందుంటుంది.

ప్రస్తుతం 'లూసిఫర్' 'అయ్యప్పనామ్ కోషియం' 'కప్పెలా' 'డ్రైవింగ్ లైసెన్స్'.. సినిమాల రీమేక్ హక్కులను టాలీవుడ్ నిర్మాతలు దక్కించుకున్నారు. ఇవన్నీ కూడా త్వరలో పట్టాలెక్కి వచ్చే ఏడాది విడుదల అవుతాయని అంచనా వేస్తున్నారు. మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా మళయాళీల మేకింగ్ ఫార్మాట్ ఫాలో అయితే టాలీవుడ్ సేఫ్ జోన్ లో ఉంటుందని, పైగా ఓ టి టి ఫార్మటు లో విడుదల చేసినా నష్టపోయే అవకాశాలు తక్కువగా వుంటాయని సినీవర్గాలు భావిస్తున్నాయి.