YSRCP MP Raghurama Krishnam Raju comments on Amaravati

ఆంధప్రదేశ్‍ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి పర్యావరణ సానుకూలతలు ఎన్నో ఉన్నాయని, పాలనా రాజధానిగా అమరావతి ఉండటమే సమంజసమని అన్నారు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం పార్టీ నిర్ణయం కాదని, ప్రభుత్వం నిర్ణయమని సృష్టం చేశారు. జగన్‍ కూడా శాసనసభలో అమరావతికి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. పార్టీ పరంగా ఎన్నడూ అమరావతిని వ్యతిరేకించలేదన్నారు. అమరావతిలో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, అవసరమైన వసతులన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. కరనా సంక్షోభంలో డబ్బు వృథా చేయడం సరికాదన్నారు. వికేంద్రీకరణ తప్పనిసరి అయితే అమరావతిని పరిపాలన రాజధాని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతికే మద్దతుగా ఉన్నారనేది తన విశ్వాసమని సృస్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ నుంచి ప్రస్తుతం ప్రభుత్వం తప్పుకోవడం అన్యాయమన్నారు.