ap farmers protest at autonagar in vijayawada

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజలు  పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ ఆటోనగర్‍లోని ఐకాస కార్యాలయ వద్ద ఉద్యమంలో అమరులైన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమలో పలువురు ఐకాస నేతలు పాల్గొని రాజధాని పోరాటంలో మృతి చెందిన రైతు కూలీలకు నివాళులర్పించారు. రైతులకు మద్దతుగా మహిళలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఉద్యమాలు ఆగిపోయి, జనజీవనం స్తంభించినా అమరావతి ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు. రైతులు ఎంతో పట్టుదలతో ఉద్యమం కొనసాగిస్తున్నార్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి స్పందించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. రాజధాని రైతులకు 13 జిల్లాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని వివరించారు.