Daggubati Purandeswari Sensational Comments on AP Capital

అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రాభివృద్ధితో ఇది ముడిపడిన అంశమని చెప్పారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహానీయులని కొనియాడారు. అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండిపడ్డారు. పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలన్నారు. అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయమనీ, అమరావతి రైతుల ఉద్యమానికి బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.