new rules for flight passengers

అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల విషయంలో, మరణాలు రేటులోనూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. అయినప్పటికీ విమానా ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ముఖ్యంగా మే, జూన్‍ నెలల్లో దేశంలో విమానాల ద్వారా ప్రయాణాలు చేసిన వారి సంఖ్య పెరిగిందని ట్రాన్స్పోర్టేషన్‍ సెక్యూరిటీ ఆడ్మినిస్ట్రేషన్‍ నివేదించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ కచ్చితంగా ముక్కు, నోరు కవర్‍ అయ్యేలా ఫేస్‍ మాస్క్ ధరించాలని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే నిబంధనలు జారీ చేశాయి. లేని పక్షంలో ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించేలా పలు సంస్థలు చర్యలకు పునుకున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సిందే అని పలు అమెరికన్‍ ఎయిర్‍లెన్స్ నిబంధనల్లో పేర్కొన్నాయి.