ramcharan new project after rrr movie

ఎన్టీఆర్, రాంచరణ్ ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటనేది డిసైడ్ అయిపొయింది. ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాలు కంఫర్మ్ చేసాడు ఎన్టీర్ మరి అదే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఏంటన్నది ప్రశ్నార్ధకము గానే వుంది. ఎందుకంటే రామ్ చరణ్ లిస్ట్ లో ఇప్పుడు చాలామంది దర్శకులున్నారు. కానీ ఇంకా ఎవరు ఫిక్స్ కాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్-కొరటాల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కొందరు, సందీప్ రెడ్డి వంగ తో ఉంటుందని మరికొందరు అనుకుంటున్నారు. మిడిల్ గా లిస్ట్ లో సురేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీళ్లందరితో పాటు మరో ఓ కొత్త వ్యక్తి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అవును.. రామ్ చరణ్ లిస్ట్ లో సతీష్ అనే ఓ కొత్త కుర్రాడు కూడా ఉన్నాడు. ఇతడు చెప్పిన ఓ స్టోరీలైన్ చరణ్ కు బాగా నచ్చిందంట. దీంతో ప్రస్తుతం తన స్టోరీలైన్ కు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో సతీష్ వున్నదని వినికిడి. ఉన్న పళంగా మధ్యలో రామ్ చరణ్ లిస్ట్ లో కనిపిస్తున్న ఈ కొత్త దర్శకుడు ఎవరా అని అంతా ఆరాలు తీస్తున్నారు. రామ్ చరణ్ మాత్రం ఈ వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నాడు. ఇటు ఆర్ఆర్ఆర్ లో నటిస్తూనే, మరోవైపు ఆచార్య ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు వీటిలో ఆర్ఆర్ఆర్ కంటే ఆచార్య సినిమా త్వరగా కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత తన నెక్ట్స్ సినిమాపై చరణ్ ఓ నిర్ణయం తీసుకుంటాడని టాలీవుడ్ భావిస్తోంది.