Vandalised Mahatma Gandhi Statue in Washington refurbished and inaugurated

వాషింగ్టన్‍లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించారు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‍ను ఓ పోలీసు దారుణంగా చంపేసిన నేపథ్యంలో చెలరేగిన ఆందోళనల్లో గుర్తు తెలియని వ్యక్తులు జూన్‍ 2న గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు. దానిపై రాతలు రాసి, రంగులు చల్లారు. అప్పటి నుంచి ఆ విగ్రహంపై కవరు కప్పి ఉంచారు. దాదాపు నెల రోజుల తర్వాత విగ్రహాన్ని పునరుద్ధరించి, ప్రజలు చూసేందుకు వీలు కల్పిస్తూ అమెరికా అధికారులతో కలిసి ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయ అధికారులు తిరిగి ప్రారంభించారు.