Butta Bomma Video song gets 250 million views

మ‌న భార‌తీయ సినిమాల్లో సంగీతం ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. పాట‌ల వ‌ల్లే హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. పాట‌లు ఎంత పెద్ద హిట్ అయినా డిజాస్ట‌ర్ అయిన సినిమాలూ ఉన్నాయి. ఈమ‌ధ్య‌కాలంలో టాలీవుడ్‌లో సినిమాతోపాటు అందులోని పాట‌లూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అనిపించుకుంది `అల..వైకుంఠ‌పుర‌ములో`. ఈ సినిమా బ‌న్ని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని చెప్పొచ్చు. థ‌మ‌న్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాట‌లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. `సామ‌జ వ‌ర‌గ‌మ‌నా..`, `రాములో రాములా`, `బుట్ట‌బొమ్మా..` పాట‌లు పెద్ద హిట్ అయి యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా `బుట్ట‌బొమ్మా.` సాంగ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతోమంది సెల‌బ్రిటీస్ స్టెప్స్ వేస్తూ వీడియోలు రిలీజ్ చేసి ఈ పాట‌పై త‌మ‌కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కెరీర్‌లో కూడా ఈ సినిమా పెద్ద మ్యూజిక‌ల్ హిట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పాట మ‌రో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. `బుట్ట‌బొమ్మా..` వీడియో సాంగ్ 250 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసి తెలుగు సినిమా పాట‌ల్లో కొత్త రికార్డును సృష్టించింది. అంటే 25 కోట్ల మంది ఈ పాట‌ను వీక్షించారు. ఒక తెలుగు పాట‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావ‌డం చాలా అరుద‌ని, ఈ రికార్డును సాధించిన ఘ‌న‌త అల్లు అర్జున్ సినిమాకు ద‌క్క‌డం విశేష‌మ‌ని సినీ విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంసిస్తున్నారు.