PM Modi Makes Surprise Visit To Leh Ladakh Amid Border Stand Off With China Boosts Morale of Troops

సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో ప్రధాని లడఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. గాల్వన్ అమరులకు నివాళులు అర్పించి సైనికులతో సమావేశమయ్యారు. సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిములో సీనియర్ సైనికాకధికారులతో భేటీ అయిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడ్డారు. విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. మోదీ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కరోనా భయాన్ని విడిచి ఆయన సైనికులకు కరచాలనం చేస్తున్నారు. అంతే కాకుండా సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు.