Search Results Web results  Jana Sena chief Pawan Kalyan praises AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలను జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌లో అభినందించారు. విజయవాడలో సీఎం జగన్‌ 1088 అధునాతన అంబులెన్స్‌లను ప్రారంభించి వాటిని రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కరోనా ఉధృతి, వ్యాధులు ప్రబలుతున్న వేళ ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రారంభించడం అనూహ్యం, అభినందనీయం అంటూ పవన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.