India extends ban on international flights till July 31

కరోనా ఉధృతి వల్ల అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఇండియా నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్‍ జనరల్‍ ఆఫ్‍ సివిల్‍ ఏవియేషన్‍ (డీజీసీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. కార్గో, ముందుగా అనుమతి పొందిన విమానాలను కొన్ని రూట్లలో మాత్రమే రాకపోకలను అనుమతిస్తామని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలను కేంద్రం నిలిపివేసింది.