indias-first-coronavirus-vaccine-may-be-launched-by-august-15-2256269

దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉన్న ప్రజలకు ఒక ఊపిరి పీల్చుకునే కబురు చెప్పింది ఐసిఎమ్‌ఆర్‌. వచ్చే ఆగస్టు 15 కల్లా కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ వేగంగా పూర్తవుతున్నాయని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ విషయంలో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బిబిఐఎల్‌)తో కలిసి పనిచేస్తున్నట్టు వివరించింది. అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకుని ఆగస్టు 15 కల్లా దీనిని అందుబాటులోకి తేనున్నామని తెలియజేసింది. సంస్థ ప్రకటించినట్టుగా వ్యాక్సిన్‌ గనుక రావడం జరిగితే భారతీయులకు అది నిజంగానే మహమ్మారి సంకెళ్లను తెంచుకున్న మరో స్వాతంత్య్ర దినోత్సవం కానుంది. మరోవైపు తొలిగా ఈ వ్యాక్సిన్‌ను కరోనాపై పోరాటంలో అలుపెరగక పనిచేస్తున్న వైద్య సిబ్బంది కోసం వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.