Nominations for Padma Awards 2021 open till Sept 15 this year

వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్‍లైన్‍ నామినేషన్లు లేదా సిఫారసులకు ఈ ఏడాది సెప్టెంబర్‍ 15 వరకు గడువు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. నామినేషన్లు లేదా సిఫారసులను ఆన్‍లైన్‍ ద్వారా, పద్మ పురస్కారాల పోర్టల్‍ ద్వారా స్వీకరిస్తారు. పద్మ విభూషణ్‍, పద్మభూషణ్‍, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలను హోం శాఖ కోరింది.