KTR lays foundation stone of Smart Data Centre in Hyderabad

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‍ పేమెంట్‍ కార్పొరేషన్‍ ఆఫ్‍ ఇండియా (ఎన్‍పీసీఐ) హైదరాబాద్‍ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్‍ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పేమెంట్‍ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వహించడం, వివాదాల పరిష్కారానికి రిజర్వు బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా (ఆర్‍బీఐ), ఇండియన్‍ బ్యాంక్స్ అసోసియేషన్‍ (ఐబీఏ) ఈ సంస్థను 2008లో ఏర్పాటు చేశారు. రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్‍పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్‍కు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్‍ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డేటా సెంటర్‍ను ఎన్‍పీసీఐ నిర్మిస్తోంది.

                ఈ డేటా సెంటర్‍ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్‍ / ఆన్‍లైన్‍ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్‍ ఆవిర్భస్తుంది. భౌగోళికంగా, మానవవనరుల పరంగా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరాన్ని

ఉన్న అనుకూలతలు నగరాన్ని ఎంచుకోవడానికి దోహదపడ్డాయి. భూకంపం, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పట్టిష్టంగా ఈ డేటా సెంటర్‍ను నిర్మించనున్నారు. ఎల్‍అండ్‍టీ సంస్థ ఈ డేటా సెంటర్‍ నిర్మాణ పనులను అప్పగించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‍ రంజన్‍ తదితరులు పాల్గొన్నారు.