India China Border Fight US Keeping Close Watch This is How China Unleashes Aggression Says Donald Trump

భారత్‍తో చైనా వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరితో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నిజరూపం సృష్టంగా కమ్యూనిస్ట్ పార్టీ నిజరూపం సృష్టంగా తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ అభిప్రాయపడుతున్నట్లు ఆయన ప్రెస్‍ సెక్రటరీ పేర్కొన్నారు. భారత్‍, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా గమనిస్తోందని, ఆ వివాదం శాంతియుతంగా పరిష్కారమవ్వాలనే తాము కోరుకుంటున్నామని వైట్‍హౌజ్‍ ప్రెస్‍ సెక్రటరీ కేలీ మెక్‍ ఎనానీ వ్యాఖ్యానించారు. భారత్‍ సహా పలు దేశాలపై చైనా అనుసరిస్తున్న ఆక్రమణ పూరిత వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ వైఖరిలో చైనా అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్‍ చైనా అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన భావిస్తున్నారని కేవీ మెక్‍ఎనానీ తెలిపారు.