Pulitzer Winner Siddhartha Mukherjee and Prof Raj Chetty named among 2020 Great Immigrants Honorees

కరోనా సంక్షోభ నివారణలో సహకరించిన వివిధ దేశాలకు చెందిన 38 మంది వలసదారులను ప్రతిష్ఠాత్మక అమెరికన్‍ ఫౌండేషన్‍ ఒకటి పురస్కారాలతో గౌరవించనుంది. వీరిలో ఇద్దరు ప్రవాస భారతీయులు ఉన్నారు. పులిట్జర్‍ అవార్డు గ్రహీత, అంకాలజిస్ట్ సిద్ధార్ధ ముఖర్జీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్ ప్రొఫెసర్‍ రాజ్‍ చెట్టీకి కార్నెగీ కార్పొరేషన్‍ ఆఫ్‍ న్యూయార్క్ 2020 గ్రేట్‍ ఇమ్మిగ్రెంట్స్ అవార్డులను ప్రకటించింది.