Bollywood Choreographer Saroj Khan Dies At 71

భారతీయ సినీ ప్రేక్షకులని తన డాన్సులతో ఉర్రూతలూగించిన సరోజ్ ఖాన్ ఇక లేరు.71 సంవత్సరాల ఆమె అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. శ్వాస తీసుకోవడంలో సమస్యల కారణంగా జూన్ ఇరవైన హాస్పిటల్ లో చేరారు. డయాబెటీస్‌తో బాధ పడుతున్న ఆమె.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కార్డియక్ అరెస్ట్‌తో ఈ రోజు (జులై 03) అర్ధ రాత్రి 1:52 లకు మరణించారు. కొరియోగ్రాఫర్ గా నలభై సంవత్సరాల కెరియర్ లో ఆమె రెండువేల పాటలకి పైగా పని చేశారు.ఆమె పుట్టిన కొద్ది రోజులకే భారత విభజన జరగడంతో వీరి కుటుంబం భారతదేశంలో స్థిరపడిపోయారు.

నజరానా సినిమాలో శ్యామ అనే పాత్రతో బాల నటిగా తెరంగేట్రం చేశారు ఆమె తన ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ జీవితాన్ని 1974 లో 'గీతా మేరా నాం' ద్వారా మొదలుపెట్టారు. అప్పట్నించీ ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మూడు సార్లు నేషన్ అవార్డ్ గెల్చుకున్నారు. 'ఏక్ దో తీన్, ధక్ ధక్ కర్నే లగా, డోలా రె డోలా..." లాంటి అద్భుతమైన పాటలకి ఆమె కొరియోగ్రాప్ చేశారు. ఆమె చివరి సినిమా కరణ్ జోహార్ నిర్మించిన 'కళంక్', చివరిసారిగా పనిచేసిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. కొరియోగ్రాఫ్ చేసిన చివరి పాట 'తబా హో గయే'.