nris-candle-light-protest-for-amaravati

అమెరికా, ఇంగ్లాండ్‍, కెనడా... వివిధ దేశాల్లో విస్తరించిన ఉద్యమ నినాదం

ఆంధ్ర ప్రదేశ్‍ కి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం 200 రోజులు పూర్తయిన సందర్భంగా జూలై 3వ తేదీన విదేశాంధ్రులు నిర్వహిస్తున్న కొవ్వొత్తుల నిరసన కార్యక్రమానికి అమెరికాలోనే కాదు...వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైల నుంచి కూడా అనూహ్యంగా మద్దతు వస్తోందని జయరాం కోమటి తెలిపారు.

న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వరకు, డిట్రాయిట్‍ నుంచి అర్కాన్సాస్‍ వరకు, మిన్నియాపోలిస్‍ నుంచి డల్లాస్‍ వరకు, సియాటెల్‍ నుంచి కాలిఫోర్నియా వరకు, కెనడా నుంచి ఇంగ్లాండ్‍ వరకు, సౌత్‍ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‍ వరకు, సింగపూర్‍, కువైట్‍, ఐర్లాండ్‍, జెర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియాతోపాటు ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఆంధ్రుడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు  ముందుకు వచ్చారు. రైతుల అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా నిరసన తెలపాలన్న జయరాం కోమటి పిలుపుకు అనూహ్య మద్దతు అన్నీ చోట్ల; నుంచి లభిస్తోంది. తొలుత అమెరికాలోని 200 నగరాల్లో చేయాలనుకున్న ఉద్యమం వివిధ చోట్ల నుంచి వచ్చిన స్పందనతో ఇతర దేశాల్లో కూడా పెద్దఎత్తున జరగనున్నది. సంఘాలు, గ్రూపులు, కులమత అనే తేడా లేకుండా ప్రతి నగరం నుంచి అందరూ ఏకమై ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎన్నారై ప్రముఖులు నగరానికి ఒకరు చొప్పున కో ఆర్డినేటర్‍లుగా నియమితులైన వారు ఉద్యమానికి అవసరమైన మద్దతును కూడగట్టారు.

ఎంతోమంది ఎన్నారైలు ఈ ఉద్యమంలో తమవంతుగా చేయూతనిస్తున్నారు. సతీష్‍ వేమన, చందు గొర్రెపాటి, వీరు ఉప్పల, వెంకట్‍ కోగంటి, భక్త బల్లా, రజనీకాంత్‍ కాకర్ల, జోగి నాయుడు, రామ్‍ ఉప్పుటూరి, యశ్‍ బొడ్డులూరి, చంద్ర మాలావత్‍, అనిల్‍ ఉప్పలపాటి, రమాకాంత్‍ కోయ, రామ్‍ కుర్రా, నాగ్‍ నెల్లూరి, సునీల్‍ పంత్ర, కేసీ చేకూరి, మల్లి వేమన, హరి బతుల, సతీష్‍ మేక. రఘు మేక. ఎన్‍ఆర్‍సి నాయుడు. సుధీర్‍ కొమ్మి. నరేన్‍ కొడాలి, కృష్ణ లాం, రాము జక్కంపూడి, శ్రీకాంత్‍ అచంట, కిరణ్‍ దుగ్గిరాల, జో పెద్దిబోయిన, గంగాధర్‍ నాదెళ్ళ, విక్టర్‍ నాయుడు, ప్రసాద్‍ చుక్కపల్లి, సురేష్‍ పుట్టగుంట, మురళి గింజుపల్లి, ఉమా యాదవ్‍ ఒమ్మి. మోహన్‍ కృష్ణ మన్నవ, రాజా కసుకుర్తి, వంశీ వెనిగళ్ల, రాధా కృష్ణ నల్లమల, వంశీ, శ్రీహరి మందాడి, ఠాగూర్‍ మల్లినేని, మురళి బొడ్డు, మల్లిక్‍ మేదరమెట్ల, శ్రీని యలవర్తి, శ్రీనివాస్‍ సంగెం, మురళి వెన్నం, లోకేష్‍, సాంబా దొడ్డ. సుమంత్‍ పుసులూరి, రత్న ప్రసాద్‍ గుమ్మడి, సురేష్‍ కండెపు, రామ్‍ యలమంచిలి, రాజేష్‍ యడ్లపల్లి, రవి పొట్లూరి, సునీల్‍ కోగంటి, కిరణ్‍ కొత్తపల్లి. రవి మందలపు, సురేష్‍ యలమంచిలి, సాంబా అంచ / వెంకట్‍ సింగు, అప్పారావు వడ్డెంపూడి, హేమ కానూరు, శ్రీధర్ అప్పసాని, అజయ్ గోదావరి, ఆప్త వీరబాబు, గోకుల్, విజయ్ గుడిసా తదితరులు ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.