COVID 19 cases in AP Secretariat

ఆంధప్రదేశ్‍ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సచివాలయం ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో 10 మందికి, జలవనరులశాఖలో ముగ్గురికి, పశు సంవర్ధకశాఖలో ఒకరికి కరోనా నిర్దారణ అయింది. దీంతో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు అదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పలువురు ఉద్యోగులు ఇవాళ ఉదయం సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.