Modi quits popular Chinese microblogging site Weibo following ban on Chinese apps

చైనాకు చెందిన 59 యాప్‍లను ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వీబో ఖాతాకు గుడ్‍బై చెప్పారు. దీంతో ఆయన ఖాతా ఖాళీగా దర్శనమిచ్చింది. చైనాలో అతిపెద్ద మైక్రోబ్లాగింగ్‍ సైట్‍ గా ఉన్న వీబోలో మోదీ ప్రొఫైల్‍ పొటోతో పాటు పోస్ట్లు, కామెంట్లను తొలగించారు. వీబోలో ప్రధాని చేసిన 115 పోస్ట్లున్నట్టు సమాచారం. వీఐపీ ఖాతాలకు సంబంధించి క్లిష్టమైన పక్రియ ఉండటం వల్ల వీటిని మాన్యువల్‍గా తొలగించాల్సి వచ్చినట్టు తెలిసింది. 2015లో చైనా పర్యటనకు ముందు వీబోలో మోదీ చేరారు.