Priyanka Chopra signs multimillion dollar deal with Amazon Prime

గ్లోబల్‍ స్టార్‍ ప్రియాంక చోప్రా అమెజాన్‍ ప్రైమ్‍తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మల్టీ మిలియన్‍ డాలర్లు విలవ చేసే  ఫస్ట్ లుక్‍ అనే టెలివిజన్‍ డీల్‍పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం ఆమె రెండ్లేళపాటు అమెజాన్‍తో కలిసి పనిచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక స్పందిస్తూ.. హిందీ, ఇంగ్లిష్‍ల్లోనే కాకుండా తనకు ఇష్టమైన భాషల్లో కూడా నటిస్తానని ప్రియాంక సృష్టం చేశారు. మహిళలకు సంబంధించిన కథలను చూపించాలనేదే తన కోరికని తెలిపారు. ఆ కథలను విభిన్నంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప క్రియేటర్స్తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. అందుకు అమెజాన్‍ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్న భాగస్వామి దొరకడం ఆనందంగా ఉందన్నారు.

భాష భౌగోలిక బేధాలు లేకుండా ప్రపంచంలోని ప్రతిభ ఒక చోట చేరి మరింత గొప్ప కంటెంట్‍ సృష్టించాలని ఓ నటిగా, నిర్మాతగా నేను కోరుకుంటాను. నా ప్రొడక్షన్‍ హౌస్‍ పర్పుల్‍ పెబెల్‍ పిక్చర్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అమెజాన్‍తో కలిసి పనిచేయడం కొత్తదనానికి పునాది లాంటింది. అలాగే కథకురాలిగా నిరంతరం కొత్త ఐడియాలును అన్వేషించాలనేది నా తపన. అవి కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ముఖ్యంగా ఒపెన్‍ మైండ్స్, నూతన దృకథం కలిగి ఉండాలి. నా 20 ఏళ్ల కేరీర్‍లో దాదాపు 60 సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు దానిని సాధించే బాటలో ఉన్నట్లు నమ్ముతున్నాను అని తెలిపారు.