donald trump fires on china

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ చైనాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటంపై ఆ దేశ వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‍ నియంత్రణ తమ చేతుల్లో లేదని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొవిడ్‍ 19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తమయేందుకు, అంతర్జాతీయంగా అతిక్లిష్ట సమస్యగా మారేందుకు చైనాయే కారణమని, అందుకు తనకు చాలా కోపంగా ఉందని ట్రంప్‍ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ప్రపంచమంతటా భయంకరంగా వ్యాపించడం కనిపిస్తోంది. అమెరికాలోనే కాకుండా ఈ వ్యాధి ప్రపంచమంతటా విధ్వంసాన్ని సృష్టించింది. ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు. నాకు కూడా అర్థమయింది. దీనంతటికీ కారణమైన చైనాపై నాకు కోపం అంతకంతకూ పెరిగిపోతోంది అని ట్విటర్‍లో ప్రకటించారు.