Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్‍ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 7, పొరుగు రాష్ట్రాలకు  సంబంధించిన 39 కేసులు ఉండగా... రాష్ట్రంలో 611  పాజిటివ్‍ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‍ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‍ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 193కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,998కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‍ ఆసుపత్రుల్లో 8,071 మంది చికిత్స పొందుతున్నారు.