Glamour overdose for Bigg Boss Telugu season 4

బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతుందో గాని బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే గట్టిగానే జరుగుతోంది. ఇక బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున అని ఒక క్లారిటీకి అయితే వచ్చినట్లు తెలుస్తోంది.  కరోనా కారణంగా సీరియల్ షూటింగ్స్ ఆగిపోయిన్నప్పటికి రియాలిటీ షోలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఎప్పటిలానే కంటిన్యూ అవుతున్నాయి. నాలుగవ సీజన్ లో మునుపెన్నడు లేని విధంగా ఈ సారి  స్టార్ సెలబ్రెటీస్ ని దింపనున్నారు. ముఖ్యంగా ఒక హీరోయిన్ దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం.

గతంలో ఎన్టీర్ నాని నాగార్జున ముగ్గురు మూడు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ బిగ్ బాస్ షోకి వచ్చిన రేటింగ్స్ ప్రకారం  ఫ్యాన్స్ అయితే గట్టిగానే ఉన్నారని ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే స్టార్ మా నిర్వహకులు బిగ్ బాస్ 4వ సిజన్ కోసం గత ఏడాది నుంచే ఆలోచించడం స్టార్ట్ చేశారు. గత కొన్ని నెలల నుంచే బిగ్ బాస్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇది లిస్ట్ అంటూ అది లిస్ట్ అంటూ వాళ్ళు చేసుతున్నారు వీలు చేస్తున్నారని  వివిధ రకాల కథనాలు వెలువడుతున్నాయి. గత నెల రోజుల నుంచి రియాలిటీ షోకి సంబంధించిన ప్లాన్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ కరోనా సమయంలో బిగ్ బాస్ 4ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఇక కంటెస్టెంట్ లిస్ట్ లో పూనమ్ బజ్వా అనే హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో ఈ బ్యూటీ నాగార్జున బాస్ సినిమాలో నటించింది. అనంతరం పరుగు సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ లో, గత ఏడాది ఎన్టీర్ మహానాయకుడిలో కూడా నటించింది.  

అలాగే మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యమిని భాస్కర్, హంస నందిని, శ్రద్దా దాస్, వంటి హాట్ బ్యూటీలు షోకు గ్లామర్ డోస్ పెంచుతున్నట్టు తెలుస్తుంది.   జనాలు చాలా వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ సారి  షో గత మూడు సీజన్ల కంటే సీజన్ 4 ఎక్కువ స్థాయిలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే స్టార్ సెలబ్రెటీస్ ని హౌజ్ లోకి లాగాలని చూస్తున్నారు. స్టార్స్ కూడా షూటింగ్స్ లేకపోవడంతో బిగ్ బాస్ 4లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనాల్లో క్రేజ్ తో పాటు మంచి ఆదాయం అంధించే పని దొరుకుంది కాబట్టి ఈ విషయంపై పెద్దగా నో చెప్పే ఛాన్స్ లేదు. పూనమ్ బజ్వాని అయితే స్టార్ మా నిర్వాహకులు ఇటీవల సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతా వారి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.