Japan interested to put their investments in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని 10 రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‍కు చెందిన సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతమ్‍ రెడ్డి తెలిపారు. సచివాలయం నుంచి జపాన్‍ సంస్థతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో బ్యాంక్‍ ఆఫ్‍ ఇంటర్నేషనల్‍ కో ఆపరేషన్‍ (జేబీఐసీ), జపాన్‍ ఇంటర్నేషనల్‍ కో ఆపరేషన్‍ ఏజెన్సీ(జైకా) ప్రీమియర్‍ జపాన్‍ డెవలప్‍మెంట్‍ ఏజన్సీ, కునియమి అసెట్‍ మేనేజ్‍మెంట్‍ కంపెనీ లిమిటెడ్‍ సంస్థలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులకు ఈ సంస్థలు సిద్ధమైనట్టు మంత్రి తెలిపారు. ఇక, అమరావతిలో నిర్మించాలని ప్రతిపాదించిన పెవిలియన్‍ విశాఖలో నిర్మించేందుకు పెట్టుబడి పెట్టనున్నాయని చెప్పారు.