Obama slams Trumps kung flu language

ఎన్నికల ర్యాలీల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వ్యవహారశైలిపై మాజీ అధ్యక్షుడు ఒరాక్‍ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‍కు సంబంధించి కుంగ్‍ప్లూ అనే పదంతో కూడిన జాత్యహంకార భాషను వినియోగిస్తూ ఆసియా వ్యతిరేక సెంటిమెంట్‍ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబర్‍లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి గత వారం డెమోక్రటిక్‍ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోయ్‍బిడెన్‍ తరపున ఒబామా నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ట్రంప్‍ ఇప్పటికే ర్యాలీలు ప్రారంభించారు. ఈ నెలలో తుల్సా ఆరిజోనాల్లో జరిగిన ర్యాలీల్లో ట్రంప్‍ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ విధంగా కుంగ్‍ప్లూ అనే జాత్యహంకార పదాన్ని వినియోగించారు.