Andhra Pradesh govt retrieves land from Amara Raja

తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేశ్‍కు ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం షాక్‍ ఇచ్చింది. గతంలో ఆయనకు సంబంధించిన అమర్‍రాజ్‍ ఇన్‍ఫ్రాటెక్‍ లిమిటెడ్‍కు కేటాయించిన 253 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా గత ప్రభుత్వం అమర్‍ రాజా నిన్‍ఫ్రాకు 253 ఎకరాలను చిత్తూరు జిల్లాలోని బంగారు పాళెం పరిధిలోని నునిగుండ్లపల్లి కొత్తపల్లిలో కేటాయించింది. అయితే ఇప్పటి వరకు అమర్‍ రాజా ఇన్‍ఫ్రా ఎటువంటి నిర్మాణాలు ఆ భూమిలో చేపట్టకపోవడంతో సర్వే నెం 65/1 లో ఉన్న భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సృష్టం చేసింది.