pv centinary celebrations by nri trs in singapore

సింగపూర్ ఎన్నారై టిఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్ లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మర్రి వెంకట రమణా రెడ్డి, అల్లాల మురళి మొహన్ రెడ్డి, మాచాడి రవిందర్ రావు, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బద్దం జితేందర్ రెడ్డి, బైర్నేని రావు రంజిత్ కుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మర్రి వెంకట రమణా రెడ్డి మరియు బైర్నేని రావు రంజిత్ కుమార్ మాట్లాడుతు కె.సి.ఆర్ గారు, కె.టి.ఆర్ గారు మరియు మహేశ్ బిగాల గారి పిలుపు మేరకు 51 దేశాలలో పీవీ గారి శత జయంతి వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు.

పీవీ గారి సేవలను స్మరించుకుంటూ పీవీ గారు బహుభాషావేత్త, రచయిత, భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వడం చాలా అవసరం అని గుర్తుచేసుకున్నారు. ఈ అద్భుతమైన పురస్కారం సాధించడంలో మన ప్రభుత్వానికి మేమంతా మద్దతు ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్పారు.

అలాగే ఈ సందర్బంగా ఆరేళ్లకాలంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులై ముందుకు సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారికి సింగపూర్ ఎన్నారై టిఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.