YS Jagan flags off 1,088 new ambulances to strengthen AP healthcare facilities

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌లో మంచి మార్పు సాకార‌మైంది. మారుమూల గ్రామాల‌కూ సేవ‌లు అందించేఆలా అత్యాధునిక 108, 104 సర్వీసులు రూపుదిద్దుకున్నాయి. ఈ త‌ర‌హాలో అందుబాటులోకి వ‌చ్చిన‌ 1088 అంబులెన్సులను బుధ‌వారం సీఎం వైయస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. దీంతో బెంజి సర్కిల్ ప‌రిస‌రాల్లో వినూత్న‌ వాతావరణం కనిపించింది. ఒకేసారి 1088 వాహనాలు కనకదుర్గమ్మ వారధి, మచిలీపట్నం, ఏలూరు హైవే మీదుగా ఆయా జిల్లాల వైపు పరుగులు పెట్టాయి. ఇక ఆ ర‌క‌మైన స‌మాధానాలు రావు... రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఎవరికైనా హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే ‘108’ నంబరుకు ఫోన్‌ చేస్తే ‘డీజిల్‌ లేదు.. డ్రైవర్‌ లేడు.. వ్యాన్‌ టైర్లు చెడిపోయాయి.. వంటి స‌మాధానాలు రాదు..’ వ‌చ్చేవి. అయితే ఇక ఆ స‌మాధానాల‌కు కాలం చెల్లిన‌ట్టేన‌ని వైద్య శాఖాధికారులు అంటున్నారు.

ఆ త‌ర్వాత త‌ర్వాత‌ అంబులెన్సుల డ్రైవర్లకు వేతనాలు చెల్లించకపోవడం, ఆ సర్వీసుల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించే 108 అంబులెన్సులు షెడ్లకే పరిమితం అయ్యాయి. ప్రజలు వాటిని మర్చిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నేప‌ధ్యంలో సీఎం వైయస్‌ జగన్, ఈ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మళ్లీ రాష్ట్రమంతటా కుయ్.. కుయ్‌.. కూతలు వినిపించేలా చర్యలు తీసుకున్నారు. గతంలో కంటే అత్యంత ఆధునాతన, మెరుగైన వైద్య సేవలందించడమే కాకుండా, రాష్ట్రమంతా ప్రతి చోటా సేవలందించేలా వాటిని తీర్చిదిద్దారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. కొత్తగా 412 అంబులెన్సులను ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు.

స‌రికొత్త‌ హంగులు...సౌక‌ర్యాలు

బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియో నేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్‌ కేర్‌ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ స్థాయిలో ‘మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల’ (ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది.మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు.

స‌రికొత్త‌ హంగులు...

సౌక‌ర్యాలు బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియో నేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్‌ కేర్‌ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ స్థాయిలో ‘మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల’ (ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది.మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు.

రూ.318.93 కోట్ల ఖ‌ర్చుతో...

656 ఎంఎంయూలు, 104 ఏఎల్‌ఎస్, 26 నియో నేటల్, 282 బీఎల్‌ఎస్‌ అంబులెన్సులతో పాటు, మరో 20 వాహనాలు.. అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1088 వాహనాలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.200.15 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్సులతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది.

గతానికన్నా మిన్న‌గా...

రాష్ట్రంలో గతంలో 18 అంబులెన్సులు 440 సెగ్మెంట్ల (ప్రాంతాలు వాహనాలు)లో మాత్రమే సేవలందించగా, ఇప్పుడు మొత్తం 705 సెగ్మెంట్లలో పని చేయనున్నాయి. నిజానికి గతంలో ఉన్న వాటిలో 104 వాహనాలు సేవలందించే సదుపాయాలు లేక షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక ఇప్పుడు ప్రారంభిస్తున్న 108 అంబులెన్సులు ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 29 చోట్ల సేవలందించనున్నాయి. అదే విధంగా గతంలో 104 అంబులెన్సులు (ఎంఎంయూ) 292 మాత్రమే ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలందిస్తూ, రోగులకు అవసరమైన మొత్తం 74 రకాల ఔషథాలు కూడా అందజేయనున్నాయి. గతంలో ఈ అంబులెన్సులలో కేవలం 52 రకాల ఔషథాలు మాత్రమే ఉండేవి. వైద్యులు అతి త‌క్కువ‌గా అందుబాటులో ఉండే ప‌రిస్థితి పోయి ఇప్పుడు ఎంఎంయూలలో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. ఇంకా వీటిని (ఎంఎంయూలను) డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని చోట్ల అత్యాధునిక వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 676 ఎంఎంయూలు ప్రతి రోజూ 40,560 మందికి సేవ చేస్తూ, ఏటా ఏకంగా 1.45 కోట్ల రోగులకు వైద్య సేవలందిస్తాయని భావిస్తున్నారు.

15నిమిషాల్లో...

ప్ర‌తి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ఆధునీక‌రించారు.