https:/Payal Rajput s special item song in Allu Arjun s Pushpa

ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న మొద‌టి సినిమా నుంచి ఒక విష‌యాన్ని ఫాలో అవుతున్నాడు. ఆర్య నుంచి రంగ‌స్థ‌లం వ‌ర‌కు త‌న ప్ర‌తి సినిమాలోనూ ఓ ఐట‌మ్ సాంగ్ పెట్ట‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు సుకుమార్ డైరెక్ట్ చేసిన ఏడు సినిమాల్లోని ఐట‌మ్ సాంగ్స్ కుర్ర‌కారుని ఉర్రూత‌లూగించాయి. స్క్రిప్ట్ మీద ఎంత శ్ర‌ద్ధ పెడ‌తాడో ఐట‌మ్ సాంగ్‌పైన కూడా అంతే శ్ర‌ద్ధ పెడ‌తాడు. దానికి త‌గ్గ‌ట్టు త‌న ప్ర‌తి సినిమాకు సంగీతాన్ని అందించే దేవిశ్రీ‌ప్ర‌సాద్ కూడా ఐట‌మ్ సాంగ్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటాడు.

సుకుమార్ గ‌త చిత్రంలో `జిగేలు రాణి` పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు తాజాగా సుకుమార్ చేస్తున్న సినిమా `పుష్ప‌`. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌ని ఒక ర‌ఫ్ లుక్‌లో అల్లు అర్జున్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా ఎప్ప‌టిలాగే ఐట‌మ్ సాంగ్ కోసం క‌స‌ర‌త్తులు మొదలు పెట్టాడు సుకుమార్‌. ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఓ కొత్త భామ‌ని దిగుమ‌తి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రో ప‌క్క ఈ పాట‌లో కియారా అద్వానీ న‌టిస్తుంద‌నే వార్త కొన్ని రోజులు వినిపించ‌గా ఆ త‌ర్వాత ఊర్వ‌శీ రౌటెలా ఈ పాట చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ పాట‌లో అల్లు అర్జున్‌తో క‌లిసి హాట్ హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ స్టెప్స్ వేయ‌బోతోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇక ఈ సినిమాలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న‌హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేశంలోని ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.