Joe Biden Names Indian American Medha Raj as his Campaign s Digital Chief

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‍ పార్టీ అభ్యర్థి జోయి బిడెన్‍ క్యాంపెయిన్‍ డిజిటల్‍ చీఫ్‍ ఆఫ్‍ స్టాఫ్‍గా భారత సంతతి మహిళ మేధా రాజ్‍ నియమింపబడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల క్యాంపెయిన్‍ అంతా ఆన్‍లైన్‍ ద్వారానే  జరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‍ విభాగం చాలా కీలకంగా కానున్నది. డిజిటల్‍ చీఫ్‍గా మేధా రాజ్‍ అన్ని విభాగాల నుండి సమచారాన్ని తెప్పించుకొని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ డిజిటల్‍ రంగంలో బిడెన్‍ క్యాంపెయిన్‍ ఎక్కువ ఫలితాలనిచ్చేలా పని చేస్తారు. బిడెన్‍ ఎన్నికల క్యాంపెయిన్‍లో డిజిటల్‍ చీఫ్‍గా చేరినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, 130 రోజుల ఎన్నికల ప్రచారంలో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయబోమని మేధ రాజ్‍ పేర్కొన్నారు. అంతకుముందు పీట్‍ బుట్టిజీగ్‍ క్యాంపెయిన్‍లో మేధా రాజ్‍ పని చేశారు. అయితే ఆయన బిడెన్‍కు మద్దతిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు.