New flu virus emerges in China with pandemic potential

కరోనా వైరస్‍ భయం తొలగకముందే చైనా పరిశోధకులు మరో బాంబును పేల్చారు. మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న ఓ కొత్త ప్లూ వైరస్‍ను గుర్తించినట్లు చెప్పారు. ఆ వైరస్‍ను పందుల క్యారీ చేస్తున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. ఆ ప్రమాదకర వైరస్‍ మానవులను కూడా సంక్రమించే అవకాశం ఉందన్నారు. ఆ కొత్త వైరస్‍ వేగంగానే మార్పు చెందుతున్నదని, కరోనా తరహాలోనే ఆ వైరస్‍ కూడా మనిషి నుంచి మనిషికి సోకుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ వైరస్‍ నుంచి తక్షణమే సమస్య లేకున్నా అది కొత్త వైరస్‍ కావడం వల్ల ఇమ్యూనిటీ సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

కొత్త ప్లూ వైరస్‍ను జీ-4 ఈఏ హెచ్‍1ఎన్‍1గా నామకరణం చేశారు. 2009లో వచ్చిన స్వైన్‍ ఫ్లూకు దగ్గరగా ఈ ప్లూ ఉన్నట్లు గుర్తించారు. వైరస్‍ను అడ్డుకోవాలంటే పందులను నియంత్రించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ప్రొసీడీంగ్స్ ఆఫ్‍ ద నేషనల్‍ అకాడమీ ఆఫ్‍ సైన్సెస్‍ జర్నల్‍లో ఈ కొత్త వైరస్‍ గురించి ప్రచురించారు. బ్రిటన్‍కు చెందిన ప్రొఫెసర్‍ కిన్‍ చౌ చాంగ్‍ తన సహచరులతో కలిసి ఈ కొత్త వైరస్‍పై స్టడీ చేశారు.