Dokka Manikya Varaprasad elected as MLC

వైఎస్సార్‍సీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‍ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ నుంచి ఖాళీగా ఉన్న స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డొక్కా ఒక్కరే నామినేషన్‍ దాఖలు చేసిన విషయం విదితమే. పద్ధతి ప్రకారం ఉపసంహరణలకు గడువు ముగియడంతో డొక్కా ఏకగ్రీంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‍ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రకటన అనంతరం మాణిక్యవరప్రసాద్‍ ఆయన నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్‍సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. డొక్కా పదవీకాలం 2023 మార్చి వరకు ఉంటుంది.