trump-niece-marys-book-describes-nightmare-of-traumas-dysfunction

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వ్యవహార శైలి ఎప్పుడూ వివాదాస్పదమే. ఆయనపై ఎందరో, ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఆయన కుటుంబంలోని వ్యక్తే ట్రంప్‍ను విమర్శిస్తూ ఏకంగా పుస్తకమే రాయడం విశేషం. ట్రంప్‍ సోదరుడైన ఫ్రెడ్‍ కుమార్తె మేరీ. ఆమె ఇటీవల ఓ పుస్తకం రాశారు. టూమచ్‍ అండ్‍ నెవర్‍ ఎనఫ్‍: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్‍ మోస్ట్ డేంజరస్‍ మ్యాన్‍ అని పేరు పెట్టారు. పుస్తకంలో పేరులోనే ట్రంప్‍ను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఇందులో తమ కుటుంబ వివాదాలను పేర్కొన్నారు. పారనాయిడ్‍ స్కిజో ఫ్రీనియాతో బాధపడుతున్న వారిపై 6 నెలల పాటు అధ్యయనం నిర్వహించిన తర్వాతే మేరీ ట్రంప్‍ ఈ పుస్తక రచనకు పూనుకోవడం గమనార్హం. ఈ పుస్తకం వచ్చే నెలలో మార్కెట్‍లోకి రానుంది.