Unlock 2 0 Guidelines and Rules Full list of what is allowed

కరోనా వ్యాప్తి కారణంగా కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్‌లాక్ 2 విధివిధానాలను ప్రకటించింది. ఇదివరకటిలాగే సినిమా హాల్స్, జిమ్స్, స్కూల్స్, కాలేజ్ లు జూలై 31 వరకూ మూసివేసి ఉంటాయని ప్రకటిచింది.

అన్ లాక్-2లోని ముఖ్యాంశాలు

* కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం

* హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం

* మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై కొనసాగుతున్న నిషేధం

* సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలపై నిషేధం కొనసాగింపు

* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.

* నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు

*కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది

* బయట తిరిగే వారు ఎల్లవేళలా మాస్కు ధరించాలి

* ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనన్న కేంద్రం

* దుకాణాలన్నీ మార్గదర్శకాల మేరకు మాత్రమే ఏర్పాటు చేయాలి

* ఎక్కువ సంఖ్యలో ఒకేచోట గుమిగూడటంపై నిషేధం కొనసాగింపు

* వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి

.* అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి.

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం,మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తుల వినియోగం నిషేధం

* అవకాశం ఉంటే ఇంటి నుంచే పని చేయాలి.