Ramajogayya Sastry Counter to RGV Over his Tweet

దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆర్జీవి అంటే ఎంతో మందికి ఒక స్ఫూర్తి అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెబుతుంటారు. అయితే ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కేవలం డబ్బు సంపాదన కోసం అడ్డమైన సినిమాలు తీసి కాష్ చేసుకుంటున్నాడని ఇటీవల ఓ టి టి ఫ్లాట్ఫామ్ లో రిలీజ్ అయినా సినిమాలను చూస్తుంటే అర్ధమౌతుంది. మరింతగా ఆకట్టుకోడానికి అతను పవర్ స్టార్ పై సినిమా తీస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్ చేయడంపై ఒక రచయిత డిఫరెంట్ గా స్పందించారు. పవర్ స్టార్ టైటిల్ తో ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ లుక్ కూడా రిలీజ్ చేశాడు. అలాగే సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెబుతూ.. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఆ విషయంపై కాస్త ఇన్ డైరెక్ట్ గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి @ramjowrites స్పందించారు. డైరెక్ట్ గా కాకుండా ప్రస్తుతం వర్మ నడుస్తున్న తీరుపై ట్వీట్ చేశారు. ‘ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం…మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్….మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు…నేను హర్ట్’ అని వివరణ ఇచ్చారు. సాధారణంగా రామజోగయ్య శాస్త్రి ఇలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళరు కానీ.. వర్మ వ్యవహరిస్తున్న తీరుకు ఆయన ఆలోచనను ఈ విధంగా చెప్పక తప్పలేదు. అయితే ఈ సీనియర్ రచయిత చేసిన ట్వీట్ కి వర్మ ఎలాంటి రిప్లై ఇస్తాడో అని ఆడియేన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ రోజు నైట్ కి మంచి రిప్లై వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్లైమాక్స్, నగ్నం అంటూ దాదాపు బి గ్రేడ్ సినిమాలను దింపేస్తున్నాడు. గతంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన ఆర్జీవి సడన్ గా ఇలాంటి మసాలా సినిమాల వైపు మళ్లడం ఇండస్ట్రీలో కొందరిని అసంతృప్తికి గురి చేస్తోంది.