PV Narsimha Rao Centenary Celebrations in London

వక్తలు గా పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ్, వాణి దేవి, మహేష్ బిగాల, లండన్ ఎంపీ లు. 

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లండన్ వేదిక గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ పివి నరసింహ రావు  జయంతి ఘనం గ నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో  ప్రధానవక్త గా జయప్రకాశ్ నారాయణ్ (రిటైర్డ్ ఐఏఎస్) వక్తలు గా, వాణి దేవి (విద్యావేత్త, పివి కూతురు), లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ, మహేష్ బిగాల (ప్రభుత్వ పివి శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు) పాల్గొని ప్రసంగించారు. 

యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, బహరేన్, వివిధ దేశాల నుండి శాస్త్రవేత్తలు, బారిస్టర్ లు, డాక్టర్ లు, విద్యావేత్తలు, సాఫ్ట్ వీర్ నిపుణులు, భారత సంతతి యూకే రాజకీయ ప్రతినిధులు, తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు  9 టీడీఫ్, జాగృతి, యుక్త , తాల్, తార ఇలా వివిధ రంగాలకు చెందిన  130 మంది ఎన్నారై లు పాల్గొన్నారు.

ప్రసంగాల అనంతరం జయప్రకాశ్, వాణి దేవి లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. 

జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ :చైనా ని సంస్కరణ లు తెచ్చి  Deng Xiaoping ఎలా అభివృద్ధి పథం లో పెట్టారో  పివిఎన్  దేశాన్ని ఆర్ధిక సంస్కరణల తో దేశాన్ని గాడిలోపెట్టారు, నాటి నుండి నేటి వరకు పనిచేసిన ప్రధానులు అంతా కూడా పివిఎన్  విధానాలనే అనుసరిస్తున్నారు, పంజాబ్ లో శాంతి నెలకొల్పడం లో సఫలం అయ్యారు, కాశ్మీర్ అంశాన్ని  పరిష్కారం లో చాలావరకు  సఫలం అయ్యారనే చెప్పుకోవొచ్చు, ఇంకో 15 ఏండ్లు  పివిఎన్ ప్రధాని గా ఉండిఉంటే  చైనా ని మించి అభివృద్ధి అధిగమించేవాళ్ళం అనడం లో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఎంత పని చేసిన కూడా కీర్తికాంక్ష కోరుకోలేదు, వ్యక్తి ప్రతిష్ట కి పాకులాడని వ్యక్తి, తన ఆలోచనలు, విధానాలతో వేరే వారికి పేరు తెచ్చిపెట్టిన కూడా సాధాసీదా గ తనపని తానూ చేసుకోవడమే తప్ప కీర్తికోసం ఉబలాట పడలేదని అన్నారు.

పి వి నరసింహారావు   తనయా వాణి దేవి  మాట్లాడుతూ : ఎవరి నాన్న వారికి హీరో, కానీ పివిఎన్ గారి కూతురు గా గర్వపడాలిసిన అంశం అని అన్నారు . స్థితప్రజ్ఞ గ కొనియాడారు, ఎలాంటి సందర్భాల్లోనూ కోపం రాని వ్యక్తి, సమయపాలన, క్రమశిక్షణ అయన విజయానికి మెట్లు అని అన్నారు. నాన్నమ్మ చెప్పిన ప్రకారం బాల్యం నుండే  ఏకసంత్ర గ్రహి అని చెప్పేవారని రెండున్నర ఏండ్ల వయసులోనే  కఠిన పద్యాలు కంఠస్తం చేసేవారని చెప్పారు. నాన్న ని మౌనం గా ఉన్నారు. మృదుస్వభావి అంటారు కానీ ఆ సమయం లో మహారాష్ట్ర లో ఉన్నప్పుడు తుపాకుల శిక్షణ ఇచ్చారని తెలిపారు.  జైళ్లశాఖ మొదలు ప్రధాని గా వివిధ శాఖల్లో  సమూలమార్పులు తెచ్చి దేశాభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యారు. పివి గారి రచనలు, వివిధ దేశాల్లో అందుకున్న బహుమతులు, వారు ఉపయోగించిన ఇష్టమైన వస్తువులు అన్ని కలిపి మ్యూజియం ఏర్పాటు చేశామని  తెలిపారు. 

ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ : తన తండ్రి తో పివిఎన్ గారి అనుబంధం గుర్తుచేసుకొని 2016 లో తన ఇండియా పర్యటనలో  హైదరాబాద్ లోని పివిఎన్ జ్ఞానభూమి ని సందర్శించానని తెలిపారు. పివిఎన్  ప్రపంచ దేశాల రాజకీయనాయకులకు  మార్గదర్శి అని అన్నారు. బ్రిటన్ లో విగ్రహ ఏర్పాటు కు తనవంతు కృషి చేస్తానని  తెలిపారు.

మహేష్ బిగాల  వీడియో సందేశం : వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడం వల్ల  వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి  కెసిఆర్ గారి ఆలోచనలతో 51 దేశాల్లో  శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నట్లు, కార్యక్రమాలు ఏడాది పొడవునా ప్రణాళిక చేసినట్లు, రాజకీయ పార్టీలు, సంఘాలకు అతీతం గా  ఐక్యకార్యకరణ గా భాగస్వామ్యం అవ్వాలని ఎన్నారై లకు పిలుపు ఇచ్చారు.

టేన్ఫ్ అధ్యకుడు ప్రమోద్ గౌడ్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమం లో తెన్ఫ్ కార్యగర్గం తో పాటు టీడీఫ్ ప్రతినిధులు కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధులు సుమన్ రావు, కిషోర్ మునగాల, సంతోష్ ఆకుల, కిల్లి ప్రసాద్-యుక్త, డా రాములు-TAL, రాంబాబు-తార. జీపీఐ-ఉదయ్ నాగరాజు, వైరాలజి శాస్త్రవేత్త బాల శ్రీనివాస్, లండన్ కార్పొరేటర్ ప్రభాకర్ ఖాజా, ఉదయ్, రెహానా, చార్టెడ్ అకౌంటెంట్  మోహన్ మద్ది, అమెరికా నుండి శ్రీధర్ గౌడ్ (విజన్ తెలంగాణ), గంగసాని రాజేశ్వర్ రెడ్డి (నాట్స్) లు పాల్గొని విజయవంతం చేసారు.

లండన్ నుండి తీర్మానం  : మహేష్ బిగాల అధ్యక్షతన తెలుగు, తెలంగాణ సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతం గా ఐక్యవేదిక ద్వారా సంవత్సరం పొడవునా పి వి  జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని  TENF ఫౌండర్ గంప వేణుగోపాల్ ప్రతిపాదించగా, పాల్గొన్న అన్ని సంఘాలు స్వాగతించారు.

అలాగే పి వి గారి కీర్తి విదేశాల్లో ఎలా చాటలో వ్యూహరచన చేద్దాం అని టీడీఫ్ అధ్యక్షుడు శ్రవణ్ గౌడ్ వివిధ సంఘాలకు సూచించారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షుడు సుమన్ రావు మాట్లాడుతూ  బ్రిటన్ లో పివి ప్రతిమ ఆవిష్కరణ కి అందరం ప్రయత్నాలు చేద్దామని  ప్రతిపాదించారు. శ్రీమతి కవిత గారు ఇప్పటికే  శతజయంతి కార్యక్రమాలపై ప్రణాళికలు ఇచ్చారు, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

యుక్త నుండి పాల్గొన్న కిల్లి సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ లండన్ లో కరోనా కారణం గ ఉన్న నిబంధనలు తొలిగిపోయాక నవంబర్ లో యుక్త నుండి భారీస్థాయి లో శతజయంతి ఉత్సవాలు చేద్దాం, అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరగా బేషరతుగా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి.

చివరగా మహేష్ జమ్ముల వందన సమర్పణ చేసి  పాల్గొన్న వక్తలు వివిధ సంఘాల ప్రతినిధులకు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ఎన్నారై ఫోరమ్ తరపున  ఈ బృహత్తర కార్యక్రమం లో మమ్ములను భాగస్వామ్య ము చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి, శ్రీ కేటీర్ గారికి, శ్రీ మహేష్ బిగాల గారికి ధన్యవాదములు తెలిపారు.

సుధాకర్ గౌడ్
ప్రధాన కార్య దర్శి
తెలంగాణ ఎన్నారై ఫోరమ్

Click here for Photogallery