Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 793 పాజిటివ్‍ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‍లో వెల్లడిచించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 706 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలోని వారు 81 మంది, ఇతర దేశాల్లోని వారు ఆరుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు ఉన్నారు.