Coronavirus Positive Cases in Telangana

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్‍ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 5,172 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 9,000 యాక్టివ్‍ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో మరో నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 247కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‍ఎంసీ పరిధిలోనే 816 ఉన్నాయి.