US announced a dollar 5 million reward  on Sajid Mir

ముంబై 26/11 దాడుల సూత్రధారి సాజిద్‍ మిర్‍ అకా మసీద్‍, గతేడాది పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్‍ సూత్రధారి మసూద్‍ అజర్‍ పాక్‍లో ఉన్నా, వారిని పాకిస్థాన్‍ ప్రాసిక్యూట్‍ చేయడం లేదని అమెరికా ఆరోపించింది. 2008 నాటి ముంబై దాడులు జరిగిన తర్వాత సాజిద్‍ మిర్‍ ప్లాస్టిక్‍ సర్జరీ చేయించుకున్నాడు. అతడిని పట్టుకున్న వారికి అమెరికా 50 లక్షల డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది. సాజిద్‍ మిర్‍ పాక్‍ నిఘా సంస్థ ఐఎస్‍ఐ ఆధ్వర్యంలో భారీ భద్రత మధ్య జీవనం గడుపుతున్నట్లు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. కానీ పాక్‍ ప్రధాని ఇమ్రాన్‍ఖాన్‍ మాత్రం వీరు తమ దేశంలో లేరని వాదిస్తున్నారు.