name-hyderabad-university-after-pv-narasimha-rao-telangana-cm-kcr-urges-pm-modi

హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‍ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పీవీ శతజయంతి సందర్భంగా ఇదే ఆయనకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి  కేసీఆర్‍ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన ఆందోళనల ఫలితంగా నాడు తీసుకొచ్చిన ఆరుసూత్రాల పథకంలో భాగంగానే 1947లో హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీని స్థాపించారని, ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ గర్వించదగిన బిడ్డ మాజీ ప్రధాని పీవీ పేరుపెట్టాలని విజ్ఞప్తి చేశారు.