Bill Gates Is Now A Target Of Coronavirus Control in USA

కరోనా కట్టడికి అమెరికా తీసుకుంటున్న చర్యలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‍ గేట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించడంలో విఫలమైన అమెరికా.. నాయకత్వ లోపంతో సతమతమవుతున్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వమారి తీవ్రత అంచనాల కంటే మరింత ఎక్కువగా ఉన్నదని తెలిపారు. భారత్‍, బ్రెజిల్‍ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొవిడ్‍ 19 ఉగ్రరూపం దాల్చుతున్నదని పేర్కొన్నారు. వైరస్‍ చికిత్సకు అమెరికా త్వరలోనే వ్యాక్సిన్‍ను అందుబాటులోకి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.