India will win both battles Covid 19 and China border

కరోనా మహమ్మారి, సరిహద్దుల వద్ద చైనాపై మోదీ ప్రభుత్వం ఏకకాలంలో యుద్ధం చేస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్‍ షా అన్నారు. ఈ రెండింటిలో భారత్‍ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ కాలంలో కాంగ్రెస్‍ నేత రాహుల్‍ గాంధీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన విమర్శించారు. రాహుల్‍ భారత్‍ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, దాని అడ్డుకుంటామని చెప్పారు. భారత వ్యతిరేక ప్రచారంపై ఒకసారి ఆత్మ పరీశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‍ పార్టీ నినాదాలను చైనా, పాక్‍ ముందుకు తీసుకువెళ్తున్నాయని విమర్శించారు.