Amazon announces 20000 jobs in India

దేశీ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‍ ఇండియా దేశవ్యాప్తంగా 20,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు అడిగే ఈ మెయిల్స్, సోషల్‍ మీడియా, ఫోన్‍ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కోసం వీరిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు వివరించింది. హైదరాబాద్‍, పుణే, కోయంబత్తూర్‍, నోయిడా, కోల్‍కతా, జైపూర్‍, చండీగఢ్‍, మంగళూరు, ఇండోర్‍, భోపాల్‍, లక్నో ప్రాంతాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుందని ప్రకటించింది.