electrical-employees-belonges-to-telangana-and-ap

ఆంధప్రదేశ్‍, తెలంగాణ మధ్య అపరిష్క•తంగా ఉన్న విద్యుత్‍ ఉద్యోగుల విభజన సమస్యకు ధర్మాధికారి ఏకసభ్య కమిటీ ముగింపు పలికింది. కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు ఏపీ విద్యుత్‍ శాఖ తెలిపింది. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్‍ ఉద్యోగుల విభజన సమస్య వివాదాస్పదమైంది.  దీన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‍ ధర్మాధికారిని నియమించింది. వాదనలను విన్న ధర్మాధికారి కమిటీ తెలంగాణ నుంచి ఆంధప్రదేశ్‍కు 655 మంది, ఆంధప్రదేశ్‍ నుంచి తెలంగాణ 584 మందిని గతంలోనే కేటాయించింది. అప్పటికే ఏపీ స్థానికత గల 71 మందిని తెలంగాణ సంస్థలు తీసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాలకు 655 మందిని కేటాయించినట్టు లెక్క తేల్చారు. దీన్నే ఖరారు చేస్తూ సుప్రీంకకు నివేదిక సమర్పించింది.