యుఎస్ ఓపెన్ ఆడతా ...

novak-djokovic-says-he-is-excited-by-the-prospect-of-playing-at-the-us-open-should-restrictions-ease

ఈ ఏడాది జరిగే రెండు గ్రాండ్‍స్లామ్‍ టోర్నమెంట్‍లలోనూ తాను బరిలోకి దిగుతానని ప్రపంచ నంబర్‍వన్‍, సెర్బియా స్టార్‍ నొవాక్‍ జకోవిచ్‍ సృష్టం చేశాడు. తొలుత ఫ్రెంచ్‍ ఓపెన్‍లో మాత్రమే బరిలోకి దిగాలని తాను భావించానన్నాడు. అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని వివరించాడు. మరో గ్రాండ్‍స్లామ్‍ టోర్నీ యూఎస్‍ ఓపెన్‍లో తాను పాల్గొంటున్నట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి దెబ్బతో ఈ ఏడాది టెన్నిస్‍ పూర్తిగా కుదేలైందన్నారు. ఇలాంటి స్థితిలో టెన్నిస్‍కు పూర్వవైభవం తేవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నాడు. తాను కూడా ఈ దశగా తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇందులో భాగంగానే ఇకపై జరిగే అన్ని ప్రధాన టెన్నిస్‍ టోర్నీలలో బరిలోకి దిగుతానన్నాడు. తనకు ఎంతో అచ్చివచ్చే అమెరికా ఓపెన్‍ను ఈసారి కైవసం చేసుకుంటాననే నమ్మకం తనకుందన్నారు. కాగా, త్వరలోనే టెన్నిస్‍ గాడిలో పడడం ఖాయమన్నాడు. కాగా, ఫ్రెంచ్‍ ఓపెన్‍కు అభిమానులను అనుమతించాలని నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాన్ని జకోవిచ్‍ స్వాగతించాడు.