
కరోనా లాక్డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు రీఓపెన్ కానున్నాయా? అంటే అనుననే అంటున్నాయి సినీ వర్గాలు. జులై 10 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయని సమాచారం. అయితే ఇక్కడ కాదండోయ్ అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికాలో. జులై 10 నుంచి లాస్ఏంజిల్స్, న్యూయార్క్ నగరాలతో సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 10 నుంచి థియేటర్లలో సినిమా చూడొచ్చని అక్కడి వార్త సంస్థ ట్వీట్ చేయగా ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ రీట్వీట్ చేశారు. దీంతో అక్కడి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.