TANA Distributed  Lunch Boxes to Stony Brook University Hospital Staff in New York

కోవిడ్‍ 19 పేషంట్లకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ చోట్ల వారిని ప్రశంసిస్తూ లంచ్‍ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్లోని స్టోనీ బ్రూక్‍ యూనివర్సిటీ హాస్పిటల్‍ సిబ్బందికి ఇటీవల తానా ఆధ్వర్యంలో లంచ్‍ ఇచ్చారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ఎంటప్రెన్యూరర్‍, ఫిలాంత్రపిస్ట్ నీలిమ తాళ్ళూరితోపాటు పృథ్వీ చేకూరి, అశోక్‍ బానోత్‍, న్యూయార్క్ తానా టీమ్‍ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్‍ సిబ్బంది లంచ్‍ ఇచ్చినందుకు తానాకు ధన్యవాదాలు తెలిపారు.