ఏపీలో 5858 చేరిన కేసులు

Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కొవిడ్‍ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 222 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‍లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరో 33 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికీ కొవిడ్‍ పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 5858కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,477 నమూనాలను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 82కి చేరినట్లు పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!