వైసీపీ ది దొంగ దెబ్బ: చంద్రబాబు

Chandrababu Naidu Press Meet Over Acham Naidu arrest

అవినీతి పై నిలదీస్తుండటంతో బలమైన తెలుగుదేశం నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా పధకం ప్రకారం. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారన్నారు. సర్జరీ జరిగిన వ్యక్తి ని ఇబ్బందులు పెడుతున్నారు అన్నారు. తమ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను ప్రలోభాలతో.లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. దొంగ దెబ్బ తీయడం సరికాదన్నారు.

బాబుకు నో పెర్మిషన్

అంతకు ముందు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు ఆస్పత్రికి వెళ్లారు. అచ్చెన్నను పరామర్శించేందుకు ఉదయాన్నే జైళ్లశాఖ డీజీ.. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు చంద్రబాబు పేషి సిబ్బంది దరఖాస్తు చేశారు. అయితే అందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. గుంటూరు చేరుకున్న తర్వాత చంద్రబాబుకు అనుమతి నిరాకరణ విషయాన్ని పార్టీ నేతలు, పోలీసు అధికారులు తెలిపారు. దీంతో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌‌కు ఫోన్ చేసి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడును పరామర్శించకుండానే చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోయారు.